ఇటీవల ఓ బేబీ చిత్రంతో సోలోగా సూపర్ హిట్ అందుకున్న సమంత శర్వానంద్ కి జోడీగా చేస్తున్న 96మూవీ షూటింగ్ లో పాల్గొంటుంది. తమిళ సూపర్ హిట్ 96 రీమేక్ గా తెరకెక్కుతునన్న ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. తమిళ చిత్రానికి దర్శకుడిగా పనిచేసిన సి ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ కి కూడా పనిచేస్తున్నారు.
ఈమధ్య నాగార్జున బర్త్ డే వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి స్పెయిన్ వెళ్లిన సమంత దాదాపు రెండు వారాలు అక్కడ గడిపి వచ్చారు. కొద్దిరోజుల క్రితం ఇండియా వచ్చిన సమంత 96 షూటింగ్ లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ కొరకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఆమె తమిళ 96మూవీలో త్రిష గెటప్ లో కనిపించారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ కంప్లీట్ ఐనట్టు సమాచారం.గతంలో ఈ మూవీ షూటింగ్ సమయంలో శర్వానంద్ గాయాలపాలయ్యారు.
