మహేష్,రష్మిక మందాన జంటగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సరిలేరు నీకెవ్వరూ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన మహేష్ లుక్స్, గెటప్స్ కి మంచి ఆదరణ దక్కింది. కాగా ఓవర్సీస్ లో ఈ మూవీని భారీగా విడుదల చేయడంతో పాటు, ఎక్కువ ప్రాంతాల్లో అందుబాటిలోకి తీసుకెళ్లే విధంగా నిర్మాతలు ప్లాన్స్ వేస్తున్నారు. దీనికోసం వీరు ఓవర్సీస్ విడుదలకు ది గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీతో చేతులు కలపనున్నారు.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ మరియు మార్కెటింగ్ లో మంచి అనుభవం ఉన్న ది గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ తో చేతులు కలపడం ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా సరిలేరు నీకెవ్వరూ మూవీ చేరేలా చూస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా మూవీ నిర్మాతలలో ఒకరైన అనిల్ సుంకర తెలియజేశారు. మహేష్ చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉన్న నేపథ్యంలో చిత్ర నిర్మాతలు భారీగా ఈ మూవీని విడుదల చేయాలని భావిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్న ఈ మూవీ 2020సంక్రాంతికి విడుదల కానుంది.
We are happy to announce that we will be associating with Great India Films in bringing farward our movie #SarileruNeekevvaru for Sankranthi 2020. With their expertise in overseas distribution segment ,we are confident of making it a bigger release all over the world.
— Anil Sunkara (@AnilSunkara1) October 12, 2019
