బెల్లకొండ శ్రీనివాస్ మూవీ లాంచ్ కి సర్వం సిద్ధం

Bellamkonda Sai Srinivas

ఈ ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్ రాక్షసుడు మూవీతో హిట్ ట్రాక్ ఎక్కారు. తమిళ చిత్రం రాక్షసన్ చిత్రానికి తెలుగు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రం కమర్షియల్ గా కంటెంట్ పరంగా బెస్ట్ మూవీగా నిలిచింది. ఈ హిట్ ట్రాక్ కొనసాగించాలని డిసైడైన యంగ్ హీరో సినిమాల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు. అందుకే రాక్షసుడు మూవీ విడుదలైన దాదాపు నాలుగు నెలల తరువాత కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.

హీరో రామ్ తో కందిరీగ వంటి హిట్ మూవీ తీసిన సంతోష్ శ్రీనివాస్ తో ఆయన సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రకటించారు. నేడు ఈ మూవీ రామానాయుడు స్టూడియోస్ లో గ్రాండ్ గా లాంచ్ కానుంది. టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయనున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ తమ మొదటి చిత్రంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీ కొరకు బెల్లంకొండ శ్రీనివాస్ ఎయిట్ ప్యాక్ బాడీతో సిద్ధమయ్యారు.

Exit mobile version