ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా ఎన్ వి నిర్మల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. అధిరోహ్ క్రియేటివ్స్ సైన్స్ ఎల్ ఎల్ పి సంస్థ తమ తొలిప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషనల్ అండ్ లవ్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్ కుస్తీ క్రీడాకారిణిగా కనిపిస్తుంది. ఇద్దరి ప్రేమికుల మధ్య అడ్డుగా ఒకరికి ఇష్టమైన క్రీడ నిలిస్తే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేది ప్రధాన కథాంశంగా మిస్ మ్యాచ్ మూవీ తెరకెక్కింది. ఈనెల 6న మిస్ మ్యాచ్ మూవీ విడుదల అవుతుంది.
‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ‘ఈ..మనసే’ పాటను ఈరోజు పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ విడుదల చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు శుభాకాంక్షలు’ అన్నారు. పవన్ తమ చిత్రంలోని పాటను విడుదల చేసినందుకు చిత్ర యూనిట్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సంజయ్ స్వరూప్, ప్రదీప్ రావత్, రూపాలక్ష్మి తదితరులు నటిస్తుండగా, ఈ చిత్రానికి సంగీతం గిఫ్టన్ ఇలియాస్ అందించారు.
