పవన్ మీద నిర్మాతల నమ్మకం.. హెవీ రెమ్యునరేషన్

Pawan Kalyan

తెలుగు మాస్ హీరోల్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ప్రత్యేకమైంది. సినిమా ఒక మాదిరిగా ఉన్నా దాన్ని విజయతీరాలకు నడిపించగల స్టామినా పవన్ సొంతం. అందుకే ఆయనకు భారీ స్థాయిలో పారితోషకం ఇవ్వడానికి నిర్మాతలు ఏమాత్రం వెనుకాడరు. ప్రజెంట్ రాజకీయాల్లో ఉన్న పవన్ త్వరలో సిజిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వనున్నారు. హిందీ చిత్రం ‘పింక్’ను తెలుగులోకి రీమేక్ చేస్తున్నారు.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. ఈ చిత్రం కోసం పవన్ కు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ముట్టజెబుతున్నారట. ఆ మొత్తం ఎంతంటే ఇప్పటి వరకు పవన్ పుచ్చుకున్న భారీ పారితోషకాల్లో మొదటి స్థానంలో ఉంటుందని తెలుస్తోంది. పైన చెప్పినట్టు సినిమా గనుక హిట్టైతే నిర్మాతలు ఆర్జించే లాభాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి మరి. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుంది.

Exit mobile version