సంచలన నిర్ణయం తీసుకున్న మణిరత్నం

mani

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవల ఆధారంగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కొన్నిరోజుల క్రితమే థాయిలాండ్లో మొదలైంది. మొదటి నుండి ఈ సినిమా విషయంలో వినిపిస్తున్న ఒకే ఒక వివాదం రచయిత వైరముత్తు. ఈయన ఈ సినిమాలోని పాటలన్నీ తానే రాస్తున్నట్టు ప్రకటించగానే వివాదం మొదలైంది.

గతేడాది మీటూ ఉద్యమంలో భాగంగా గాయని చిన్మయి ఆయనపై ఆరోపణలు చేశారు. అలాంటి ఆరోపణలున్న వ్యక్తిని సినిమాలోకి తీసుకుని ఎలా ప్రోత్సహిస్తారని దర్శకుడు మణిరత్నం, సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహామాన్ మీద చిన్మయితో పాటు మీటూ ఉద్యమ మద్దతుదారులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. దీంతో ఆలోచనలోపడిన మణిరత్నం అండ్ టీమ్ వైరముత్తును ప్రాజెక్ట్ నుండి పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన అందాల్సి ఉంది.

ఈ పరిణామంతో చిన్మయితో పాటు మీటూ ఉద్యమానికి మద్దతు తెలిపిన చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది చిన్మయి సాధించిన విజయమని, మణిరత్నం మంచి నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడుతున్నారు.

Exit mobile version