ఏపీ సీఎం జగన్ కి మహేష్ జన్మదిన శుభాకాంక్షలు

Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని.. ఆయన విజయవంతంగా ముందుకు సాగాలని మహేష్ కాంక్షించారు. కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ వేదికగా మహేష్ జగన్ కి శుభాకాంక్షలు తెలిపారు. 1972 డిసెంబర్ 21న రాయలసీమ పులివెందులలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి నేడు 47వ వసంతంలోకి అడుగుపెట్టారు.

కొంత కాలంగా మహేష్ సోషల్ మీడియాలో చురుకుగా ఉంటున్నారు. ఆయన సోషల్ మీడియా వేదికగా అనేక ముఖ్య ఘటనలపై స్పందిస్తున్నారు. మహేష్ లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు వచ్చే నెల 11న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మిక మందాన నటిస్తుండగా, దేవిశ్రీ సంగీతం అందించారు. దిల్ రాజు, రామ బ్రహ్మం సుంకర నిర్మించారు.

Exit mobile version