నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న కొత్త చిత్రం ‘ఎంత మంచివాడవురా’. సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవలే సినిమా షూటింగ్ మొత్తం ముగియడంతో చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసింది. హీరో కళ్యణ్ రామ్ శబ్ధాలయ స్టూడియోస్ లో తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నారు. మరో రెండు రోజుల్లో డబ్బింగ్ పూర్తవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్రబృందం. ప్రమోషన్లలో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 5న లేదా జనవరి 6న జరిగే ఈ ఈవెంట్ కి ప్రత్యేక అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందించడం జరిగింది. ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్తలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్ కథానాయకిగా నటించింది. జనవరి 15వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘118’ చిత్రంతో హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ ‘ఎంతమంచి వాడవురా’తో ఆ విజయాన్ని కొనసాగించాలని భావిస్తున్నారు.
