బుక్ మై షో టాప్ ట్రెండింగ్ సినిమాలలో ప్రభాస్ దే పై చేయి

Saaho3

2019 సినీ క్యాలెండర్ దాదాపు ముగిసిపోయింది. దీనితో ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధికంగా ట్రెండ్ అయిన చిత్రాల లిస్ట్ ని ప్రముఖ మూవీ బుకింగ్ వెబ్ సైట్ బుక్ మై షో విడుదల చేసింది. ఈ ఏడాది ఎక్కువగా ట్రెండ్ అయిన జాబితాలో ప్రభాస్ సాహో రెండవ స్థానం ఆక్రమించింది. మరి మొదటి స్థానం ఎవరిదంటారా..? అనూహ్యంగా మార్వెల్ వారి సూపర్ హీరోస్ మూవీ అవెంజర్స్ ది ఎండ్ గేమ్ ఫస్ట్ ప్లేస్ కైవసం చేసుకుంది. హాలీవుడ్ చిత్రాలను మినహాయిస్తే ప్రభాస్ సాహో దేశవ్యాప్తంగా అత్యధికంగా ట్రెండ్ అయిన చిత్రంగా నిలిచింది.

ఇక మూడవ స్థానంలో మరో సౌత్ ఇండియన్ మూవీ బిగిల్ నిలవడం విశేషం. విజయ్ అట్లీ కాంబినేషన్ లో వచ్చిన బిగిల్ బుక్ మై షో టాప్ ట్రెండింగ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఇక హృతిక్ టైగర్ ష్రాఫ్ నటించిన వార్ నాలుగవ స్థానంలో, మరో హాలీవుడ్ మూవీ కెప్టెన్ మార్వెల్ ఐదవ స్థానం ఆక్రమించాయి. మెగాస్టార్ ప్రతిష్టాత్మక చిత్రం సైరా ఆరవ స్థానంలో నిలిచింది. అజిత్ విశ్వాసం ఎనిమిది, రజిని పేట పదవ స్థానంలో నిలిచాయి.

Exit mobile version