మహానటి చిత్రం నటి కీర్తి సురేష్ జీవితాన్నే మార్చివేసింది. ఆ చిత్రంలోని నటనకు ఆమె ఏకంగా అత్యున్నత పురస్కారమైన జాతీయ అవార్డును గెలుపొందారు . ఐతే తనకు ఇంతటి పేరు తెచ్చిపెట్టిన మహానటి పాత్రను ఒప్పుకోవడానికి కారణం ఒక వ్యక్తి అట. కీర్తి సురేష్ మామయ్య గోవింద్ గారే సావిత్రి పాత్రను కీర్తి సురేష్ ఒప్పుకోవడానికి కారణమట. సావిత్రమ్మ పాత్రను బాగా చేయగలనన్న నమ్మకం తనకు తన మామయ్య గారే ఇచ్చారని, ఈ మూవీని తాను ఒప్పుకోవడానికి ఆయనే కారణమని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ సంధర్భంగా తనను నమ్మినందుకు దర్శకుడు నాగ్ అశ్విన్‌కు చాలా థ్యాంక్స్ అని కీర్తి తెలిపింది.
అలాగే తాను గెలుచుకున్న జాతీయ అవార్డును సావిత్రికి అంకితం ఇస్తున్నట్లు చెప్పింది. కాగా జాతీయ అవార్డు అందుకున్న తరువాత తనపై ఒత్తిడి ఎక్కువగా ఉందని, కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నానని కీర్తి పేర్కొంది. కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో మిస్ ఇండియా, రంగ్ దే చిత్రాల్లో నటిస్తున్నారు, అలాగే తమిళంలో రజనీ 158వ చిత్రం, పెంగ్విన్ మూవీల్లో కనిపించనుంది. వీటితో పాటు మలయాళంలో మోహన్‌లాల్ మూవీలోనూ కీర్తి నటిస్తోంది.
