బ్యూటీ పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వారా అలవైకుంఠపురంలో మూవీలోని బుట్ట బొమ్మా సాంగ్ మేకింగ్ వీడియోలోని ఓ చిన్న క్లిప్ విడుదల చేశారు. బన్నీ డిజైనింగ్ షర్ట్ పూజ పింక్ ప్రాక్ ధరించి పాటకు తగ్గట్టుగా వేస్తున్న ట్రెడిషనల్ స్టెప్స్ కట్టిపడేసేలా ఉన్నాయి. బుట్ట బొమ్మా డ్యూయట్ థియేటర్స్ లో ఒక రేంజ్ లో పేలడం ఖాయం అనిపిస్తుంది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చే నెల 6న హైదరాబాద్ వేదికగా గ్రాండ్ గా జరపనున్నారు.
బన్నీ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురంలో పై భారీ అంచనాలున్నాయి. థమన్ సాంగ్స్ బంఫర్ హిట్ కావంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీగా ఉంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరో సుశాంత్, నివేదా పేతురాజ్, టబు కీలక పాత్రలు చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 12న అల వైకుంఠపురంలో విడుదల కానుంది.
Here’s a special sneak peak of #buttabomma for you’ll…shhhh…don’t tell anyone ???????????? #alavaikunthapurramuloo #topsecret @alluarjun #Trivikram @MusicThaman @ArmaanMalik22 @haarikahassine @GeethaArts #PSVinod pic.twitter.com/9y9qpXYluQ
— Pooja Hegde (@hegdepooja) December 29, 2019
