‘ప్రతిరోజూ పండగే’ చిత్రం హీరో సాయి తేజ్ కు అన్ని విధాలా కలిసొచ్చింది. సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న అయనకు కెరీర్లోనే పెద్ద విజయంగా నిలిచి ప్రేక్షకుల్లో తేజ్ పట్ల ఉన్న మరింత నమ్మకం కలిగేలా చేసింది. డిస్ట్రిబ్యూటర్లలో సైతం తేజ్ మార్కెట్ స్థిరపడిందనే ఉద్దేశ్యాన్ని కలిగించింది. ఇలా పలురకాలుగా తేజ్ జర్నీకి మంచి బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా ఓవర్సీస్లో సైతం అతనికి మార్కెట్ ఏర్పడేలా చేసింది.
9వ రోజు 20,000 డాలర్లకు పైగానే వసూలుచేసి మొత్తంగా హాఫ్ మిలియన్ మార్క్ క్రాస్ చేసింది. తేజ్ కెరీర్లో ఇవే హయ్యస్ట్ ఓవర్సీస్ వసూళ్లు కావడం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే చిత్రం అన్ని ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టే దిశగా వెళుతోంది. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సమర్పణలో బన్నీ వాస్ నిర్మించారు.
