మహేష్ తమన్నా కలిసి చేసిన డాంగ్ డాంగ్ సాంగ్ యూట్యూబ్ లో దుమ్మురేపుతోంది. యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఈ సాంగ్ 3.5 మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. మహేష్ ఫ్యాన్స్ ఈ పాటకు లైక్స్ కొడుతూ కామెంట్స్ పెడుతూ తమ అభిమానం తెలుపుకుంటున్నారు. ఈ ప్రోమో సాంగ్ గత రాత్రి 8:00 గంటలకు విడుదల కావాల్సిఉండగా కొన్ని అనివార్య కారణాల వలన రాత్రి 10:44 నిమిషాలకు విడుదల చేశారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఐటెం నంబర్ గా రానున్న ఈ సాంగ్ లో మహేష్ స్టెప్స్ హైలెట్ గా నిలిచాయి.
సరిలేరు నీకెవ్వరు మూవీ సంక్రాంతి కానుకగా వచ్చే నెల 11న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మహేష్ అజయ్ కృష్ణ అనే ఆర్మీ మేజర్ రోల్ చేస్తున్నారు. ఐతే కథ ప్రధానంగా రాయలసీమ నేపథ్యంలో నడవనుంది. రష్మిక మందాన హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందించారు.
