‘ప్రతిరోజూ పండగే’ కృష్ణ జిల్లా లేటెస్ట్ కలెక్షన్స్ !

Prathiroju Pandage 1

సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ప్రతిరోజూ పండగే’ వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ము దులుపుతుంది. కామెడీ మరియు ఫ్యామిలీ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్ర వసూళ్లు స్టడీగా ఉన్నాయి. ముఖ్యంగా కృష్ణలో ఈ చిత్రం విశేష ఆదరణ దక్కించుకుంటుంది. కృష్ణ జిల్లాలో 10వ రోజుగానూ ఈ సినిమాకి 14.63 లక్షల షేర్ వచ్చింది. ఇప్పటివరకూ ఒక్క కృష్ణ జిల్లాలో 1.52 కోట్లను ఈ సినిమా వసూళ్లు చేసింది. ఇక రాబోయే వారంలో కూడా మరే పెద్ద సినిమా రిలీజ్ కు లేకపోవడం కూడా ఈ సినిమాకి కలిసి రానుంది.

మొత్తానికి తప్పనిసరిగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో సాయి తేజ్ కి ప్రతిరోజూ పండగే మంచి హిట్ చిత్రంగా నిలిచింది. పైగా ఈ హీరోకు తన కెరీర్ లోనే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను వస్తున్నాయి ఈ సినిమాకి. మెయిన్ గా సాయి తేజ్ ఈ సినిమాతో మెగా అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత బన్నీ వాసు నిర్మించారు. సాయి ధరమ్ తేజ్ కి జంటగా రాశి ఖన్నా నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు.

Exit mobile version