మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్ లో ‘చిరు 152వ’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం యొక్క ప్రీ-ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. గత నెలలోనే మణి శర్మ, దర్శకుడు కొరటాల శివ ఈ చిత్ర మ్యూజిక్ సిట్టింగ్ లను నిర్వహించారు. కాగా ఇప్పటికే మణిశర్మ ఈ చిత్రానికి మూడు ట్యూన్లను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రత్యేక మాస్ సాంగ్ ఉందట, ఆ సాంగ్ లో ఓ టాలెంటెడ్ హీరోయిన్ చిరుతో ఆడిపాడనుందని తెలుస్తోంది. హీరోయిన్ రెజీనా మెగాస్టార్‌తో స్టెప్స్ వేయబోతుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక జనవరిలో మొదటివారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి ఈ సినిమాను ఆగస్ట్ 14న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో మెగా అభిమానులు కోరుకునే అంశాలతో పాటు హీరో ఎలివేషన్స్ తో కూడుకునే బోలెడంత హీరోయిజమ్ కూడా ఉండనుంది. అన్నిటికంటే ప్రధానమైన సోషల్ ఇష్యూ తప్పకుండా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే మెగాస్టార్ – కొరటాల నుండి ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రానుంది.
