“వేదం” టీం అంతటికీ స్పెషల్ థాంక్స్ చెప్పిన బన్నీ.!


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటనలో కూడా ఒక రకమైన మాడ్యులేషన్ ఉంటుంది. ఎలాంటి రోల్ లో అయినా సరే అద్భుతంగా తన హావభావాలతో నటించగలిగే బన్నీ కెరీర్ లో నటన పరంగా ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసిన రోల్ ఏదన్నా ఉంది అంటే అది “వేదం” సినిమాలో కేబుల్ రాజు పాత్రే అని చెప్పాలి.

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించిన ఈ ఎమోషనల్ మల్టీస్టారర్ చిత్రం విడుదలై నేటితో ఒక దశాబ్దం పూర్తి చేసుకుంది. దీనితో బన్నీ ఈ సినిమాకు పనిచేసిన ప్రతీ ఒక్క టెక్నీషియన్ సహా తన కో స్టార్స్ అందరికీ తన సోషల్ మీడియా ద్వారా థాంక్స్ చెప్పారు.

దర్శకుడు క్రిష్ విజన్ మరియు ప్యాషన్ కు తన మనస్ఫూర్తిగా థాంక్స్ చెప్తున్నా అని అలాగే మంచు మనోజ్,అనుష్క, మనోజ్ బాజ్ పాయ్ అలాగే ఇతర నటులు టెక్నిషియన్స్ ప్రతీ ఒక్కరికీ ముఖ్యంగా సంగీతం అందించిన ఎం ఎం కీరవాణి గారికి కూడా తన ధన్యవాదాలు తెలుపుతున్నా అని అల్లు అర్జున్ పోస్ట్ చేసారు.

Exit mobile version