నెటిజెన్స్ హేటర్స్ లిస్ట్ లో చేరిన స్టార్ హీరోయిన్

kareena kapoor
హీరో సుశాంత్ సింగ్ మరణం బాలీవుడ్ లో పెద్ద ఉద్యమానికి దారితీసింది. బాలీవుడ్ బడా ఫ్యామిలీల కారణంగా అణగదొక్కబడిన చాల మంది నటీనటులు వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక నెటిజెన్స్ సోషల్ మీడియా వేదికగా గతంలో సుశాంత్ పై అవమానకర వ్యాఖ్యలు చేసిన కరణ్ జోహార్, అలియా వంటి వారిని ట్రోల్ చేస్తున్నారు. తాజాగా నెటిజెన్స్ హేటర్స్ లిస్ట్ లో కరీనా కపూర్ కూడా చేరింది.

గతంలో కరీనా కపూర్ సుశాంత్ గురించి కొన్ని అవమానకర వ్యాఖ్యలు చేసింది. సదరు వీడియోలను బయటికి తీసిన నెటిజెన్స్ కరీనాపై విరుచుకుపడుతున్నారు. ఆమెకు అసలు నటన రాదని, కేవలం కపూర్ అనే పేరు కారణంగా పరిశ్రమలో ఎదిగింది, ఆమెకు పొగరు కూడా అని కౌంటర్లు ఇస్తున్నారు. మరి నెటిజెన్స్ కౌంటర్స్ కి కరీనా ఏమి ఆన్సర్ ఇస్తుందో చూడాలి.

Exit mobile version