వర్క్ షాప్ లో హీరోహీరోయిన్లు సీన్స్ ప్రాక్టీస్ !

యంగ్ హీరో కార్తికేయ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా తెరకెక్కబోతున్న “చావు కబురు చల్లగా” సినిమా కోసం హీరోహీరోయిన్స్ ప్రస్తుతం వర్క్‌ షాప్‌ ల్లో పాల్గొంటున్నారట. తమ కలయికలో వచ్చే సీన్స్ ను కార్తికేయ, లావణ్య ముందుగానే కలిసి నటిస్తూ సీన్స్ లో తమ ఇన్ వాల్వ్ మెంట్ ను పెంచుకుంటున్నారట. అక్టోబర్ మూడో వారం నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

కాగా కౌశిక పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. ఈ మూవీ విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మాతగా రానుంది. విభిన్నమైన పాత్రలో నటించే కార్తికేయ ఈ మూవీలో బస్తీ బాలరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. దర్శకుడు కౌశిక్ చెప్పిన పాయింట్ నచ్చి నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాను కార్తికేయతో చేయనున్నారు.

Exit mobile version