ఈ ఇద్దరు శ్రీనుల సినిమాకు భారీ రెస్పాన్స్.!

టాలీవుడ్ పవర్ ఫుల్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే మన టాలీవుడ్ యువ హీరో బెల్లం కొండ శ్రీనుల కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనింగ్ చిత్రం “జయ జానకి నాయక”. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ఈ చిత్రం అప్పుడు మంచి విజయాన్ని అందుకుంది. అయితే బోయపాటి సినిమాలు అంటే హీరో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా అందుకు తగ్గట్టుగానే ఈ చిత్రంలో కూడా బెల్లం కొండ శ్రీనివాస్ ను యాక్షన్ కటౌట్ గా చూపించారు.

అయితే ఈ చిత్రం ఒక్క మన తెలుగు ఆడియెన్స్ లో మాత్రమే కాకుండా హిందీ ఆడియెన్స్ నుంచి కూడా భారీ స్థాయి రెస్పాన్స్ ను అందుకుంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో విడుదల చెయ్యగా అది ఇప్పుడు ఏకంగా 300 మిలియన్ మిలియన్ వ్యూస్ మార్క్ ను క్రాస్ చేసింది.

బహుశా బెల్లంకొండ శ్రీను సినిమాకు ఇదే మొదటి 300 మిలియన్ మార్క్ సినిమా కావచ్చు.అలాగే ఈ చిత్రానికి 1.5 మిలియన్ లైక్స్ కూడా రావడం విశేషం. దీనితో ఈ ఇద్దరు శ్రీనుల సినిమాకు భారీ స్థాయి రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫీమేల్ లీడ్ లో నటించగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

Exit mobile version