తెలంగాణా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపిన నందమూరి రామకృష్ణ!

Ramakrishna

గత కొన్ని రోజుల కితమే తెలుగు చలన చిత్ర ఆరాధ్య దైవం విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణా ప్రభుత్వం పాఠశాలలో పాఠ్యాంశంగా చేర్చిన సంగతి తెలిసిందే. అందుకు గాను నందమూరి అభిమానులు మరియు రామారావు వారసుడు నందమూరి బాలకృష్ణ కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇపుడు అలాగే నందమూరి మరో వారసుడు రామకృష్ణ తెలంగాణ ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రెస్ నోట్ ను విడుదల చేసారు.

“ముందుగా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యముగా మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గిరికి, వారి కాబినెట్ కు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.మా తండ్రిగారి, నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్రను తెలంగాణ రాష్ట్ర పాఠశాల సిలబళ్ళో చేర్చటం చానా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాము.మేమె కాదు, యావత్ ప్రపంచమంతటా తెలుగు ప్రజలు వారి వారి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ గర్వపడుతున్నారు.

అంతటి మహనీయుని జీవిత చరిత్రను తెలంగాణ పాఠశాల సిలబళ్ళో చేర్చి పాఠశాల విద్యార్థులకు పాఠ్యఅంశం చేయటం భావితరాలకు తప్పకుండా మార్గ దర్శకం ఉంటుంది.స్వర్గీయనందమూరి తారక రామారావు గారిలో ఉన్న నీతి, నిజాయితీ, కృషి, క్రమశిక్షణా, పట్టుదల, నిభంధతా ….ఇవన్నీ భావి తరాల విద్యార్థులకు ఒక ఊపిరిగా, స్ఫూర్తిగా తీసుకొని పాటిస్తే భవిషత్తులో ఉత్తమ పౌరులుగా తయారు ఔతారాన్ని భావిస్తున్నాను..మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అని ఆయన తెలిపారు.

Exit mobile version