ఆన్ స్క్రీన్ పై టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండకు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. కానీ ఈ లాక్ డౌన్ సమయంలో విజయ్ ఆఫ్ స్క్రీన్ యాటిట్యూడ్ ఎంత బాగుంటుందో కూడా నిరూపితం అయ్యింది. చాలా మంది యువతకు మరియు కరోనా టైం లో తాను మరియు తన టీం ఎంతో సహాయం చేసారు.
అయితే ఇప్పుడు ఎలాగో షూటింగ్స్ మళ్ళీ పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ టీం కు ఊహించని ట్విస్ట్ ఎదురు కావడంతో వారు అందరినీ కొన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు తమకు విజయ్ టీం తో సంబంధాలు ఉన్నాయని పలు ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్న అంశం బయటపడింది.
కానీ అవన్నీ కేవలం ఫేక్ కాల్స్ మాత్రమే అని విజయ్ టీం నుంచి కానీ అతని కొత్త సినిమాకు సంబంధించి కానీ ఎలాంటి ఆడిషన్స్ ఎవరు పెట్టలేదని ఏ ప్రాజెక్ట్ అయినా సరే నిర్మాతలు మాత్రమే ప్రకటిస్తారని తెలుపుతున్నారు. విజయ్ టీం పేరిట ఆడిషన్స్ చేస్తున్నామని ఎవరైనా తెలిపితే వాటిని నమ్మి మోసపోవద్దని సోషల్ మీడియా ద్వారా విజయ్ నిర్మాతలు సహా సినీ పీఆర్వో లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Team @TheDeverakonda reacts on audition and other reports that are making rounds in circles
Any new film will be announced by #VijayDeverakonda himself or producers.Action would taken against people who are misusing his name
Team #VD @GskMedia_PR pic.twitter.com/SDMeGJJGD2
— BA Raju's Team (@baraju_SuperHit) September 13, 2020
