సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’. ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సూర్య పాత్రకు తెలుగులో యంగ్ హీరో సత్యదేవ్ డబ్బింగ్ చెప్పారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సత్యదేవ్ వాయిస్ సూర్యకు చాల బాగా సెట్ అయిందట. సీరియస్ క్యారెక్టరైజేషన్ కి సత్యదేవ్ కూడా అంతే సీరియస్ టోన్ లో డబ్బింగ్ చెప్పాడట.
కాగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యకు తమిళంలో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అందుకే ఆయన ప్రతి చిత్రం తెలుగులో డబ్ అవుతూనే ఉంటుంది. తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు ఇందులో ఓ కీలకపాత్ర చేయడం జరిగింది. అక్టోబర్ 30న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. థియేటర్స్ పై ఇంకా క్లారిటీ రాకపోవడంతో ఈ చిత్రాన్ని అమెజాన్‌లో విడుదల చేయడానికి రెడీ అయ్యారు మేకర్స్.
అపర్ణ బాలమురళి సూర్యకి జంటగా నటిస్తుండగా, జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. సూర్యకి గత రెండు చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ చిత్రంపైనే సూర్య ఆశలు పెట్టుకున్నారు.