
స్టార్ హీరోలకు ఏ రేంజ్ లో అభిమానులు ఉంటారు అలాగే హీరోయిన్స్ లో కూడా స్పెషల్ గా క్రేజ్ ఉన్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అందులోనూ మన టాలీవుడ్ నుంచి అయితే మరింత మంది ఉన్నారు. అలాంటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో స్వీటీ అనుష్క కూడా ఒకరు. కేవలం ఆమెపై తీసిన సినిమాలకే మంచి హైప్ వచ్చేస్తుంది.
అలాంటి అనుష్క చాలా కాలం విరామం తర్వాత చేసిన ప్రయోగమే “నిశ్శబ్దం”. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అలా వచ్చి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను దర్శకుడు పంచుకున్నట్టు తెలుస్తుంది.
అసలు ఈ చిత్రం ఇంత పెద్దగా రావడానికి అసలు కారణమే అనుష్క అని దర్శకుడు అంటున్నాడు. ఈ కథను అనుష్క కు చెప్పినపుడు ఆమె చాలా ఎగ్జైట్ అయ్యారని అందుకే ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రామాణికాలతో తీస్తే ఇండియన్ సినిమాకు ప్లస్ అవుతుందని సూచిస్తేనే మొత్తం నాలుగు భాషల్లో ప్లాన్ చేశామని తాను తెలిపారు.