హీరో నితిన్ ఇప్పటికే వరుసగా సినిమాల్ని ఒప్పుకున్నాడు. లాక్ డౌన్ ముందు వరకూ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ చిత్రం షూటింగ్ చేసిన నితిన్.. సమ్మర్ లో ఆ సినిమాని రిలీజ్ చేసి.. తన పెళ్లికి అభిమానులకు గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నాడు. కానీ, మధ్యలో కరోనా రావడం, గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్న పెళ్లిని కూడా సింపుల్ గా ముగించడం.. చకచకా జరిగిపొయాయి. అయితే ‘రంగ్ దే’ సినిమాని సంక్రాంతి సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఎలాగూ ఈ లోపు థియేటర్లు కూడా ఓపెన్ అయిపోతాయి.
ఇక ‘రంగ్ దే’ సినిమా తరువాత వెంటనే చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్ లో చేస్తోన్న సినిమా షూటింగ్ ను కూడా స్టార్ట్ చేశాడట . ఈ చిత్రానికి ‘చదరంగం’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని.. సినిమాలో చదరంగం ఆటకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని అందుకే ఆ టైటిల్ పెడుతున్నారని తెలుస్తోంది. ఎలాగూ యేలేటి సినిమాలన్నీ కూడా మిస్టరీ, సస్పెన్స్ కూడిన కథలై ఉంటాయి కాబట్టి.. ఇక ఈ సినిమా కూడా అలాగే మిస్టరీ నేపథ్యంలోనే ఉంటుంది కాబట్టి టైటిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇక ఈ ‘చదరంగం’ చిత్రంతో పాటు నితిన్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ పిరియాడిక్ ఫిల్మ్ కూడా చేస్తున్నాడు.
