మంచు వారి హీరో మంచు విష్ణు కథానాయకునిగా స్టార్ హీరోయిన్ కాజల్ కథానాయికగా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “మోసగాళ్లు”. ప్రపంచంలోని బిగ్గెస్ట్ స్కామ్ ఆధారంగా జెఫ్రీ గీ చిన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే పోస్టర్ మరియు టీజర్స్ తో ఆకట్టుకున్న ఈ చిత్ర యూనిట్ ఇప్పుడు మరో హంగును అదను చేస్తున్నారు.
ఈ చిత్రానికి మన టాలీవుడ్ ఆల్ టైం ఫేవరెట్ హీరో విక్టరీ వెంకటేష్ తన వాయిస్ ఓవర్ ను ఇస్తున్నారని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసేసారు. అలాగే వెంకీ మామ ఈ చిత్రానికి వాయిస్ ఓవర్ ను అప్పుడే స్టార్ట్ చేసేసారు. ఈ చిత్రానికి మంచు విష్ణు స్వీయ నిర్మాణంలో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తుండగా సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. అలాగే నవదీప్, నవీన్ చంద్ర, అలాగే రుషి శర్మ తదితరులు నటిస్తున్నారు.
