‘ఖలేజా’, ‘మర్యాద రామన్న’ నా ఆల్‌టైమ్ ఫేవరెట్స్: తెలుగు సినిమాలపై జేసన్ సంజయ్ మనసులోని మాట

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ మెగాఫోన్ పట్టి దర్శకుడిగా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సిగ్మా’ (Sigma) ద్వారా ఆయన డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది.

​తెలుగు సినిమాలపై ఆసక్తిని పంచుకున్న జేసన్ సంజయ్

​ఈ ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన జేసన్ సంజయ్, టాలీవుడ్ చిత్రాలపై తనకున్న ప్రత్యేక అభిమానాన్ని గుర్తుచేసుకున్నారు. తనకు నచ్చిన చిత్రాల గురించి ప్రస్తావిస్తూ.. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘ఖలేజా’, ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘మర్యాద రామన్న’ సినిమాలు తన ఆల్‌టైమ్ ఫేవరెట్స్ అని తెలిపారు. ఈ రెండు సినిమాలను ఇప్పటికీ ఎంతో ఇష్టంగా చూస్తుంటానని ఆయన పేర్కొన్నారు.

​హీరోగా సందీప్ కిషన్‌ను ఎంపిక చేయడంపై స్పందిస్తూ.. గతంలో వచ్చిన ‘మైఖేల్’ సినిమాను తమిళంలో చూశానని, అందులో సందీప్ నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని చెప్పారు. ఆ ఇంపాక్ట్‌తోనే ‘సిగ్మా’ కథ సిద్ధమైన వెంటనే సందీప్‌ను సంప్రదించినట్లు వెల్లడించారు.

హైస్ట్ అడ్వెంచర్ డ్రామాగా ‘సిగ్మా’

​సినిమా కథాంశంపై దర్శకుడు స్పష్టత ఇస్తూ.. ‘సిగ్మా’ హైస్ట్, అడ్వెంచర్, ట్రెజర్ హంట్ అంశాలతో కూడిన కథ అని వివరించారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రతి ప్రేక్షకుడికి చేరువయ్యేలా సహజంగా, పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు చెప్పారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఇది మంచి వినోదాన్ని అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Exit mobile version