సీఐ శ్యామ్ సుందర్‌కు చిరు సెల్యూట్

Untitled 5

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఒక సీఐ డిఎస్పీకి సెల్యూట్ చేస్తున్న ఫోటో అది. అందులో విశేషం ఏమిటంటే ఆ సీఐ, డిఎస్పీ తండ్రీ కూతుళ్లు. సీఐ శ్యామ్ సుందర్ తన కుమార్తె డిఎస్పీ జెస్సి ప్రశాంతికి డ్యూటీలో భాగంగా సెల్యూట్ చేశారు. ఫోటోలో సెల్యూట్ చేస్తున్నప్పుడు శ్యామ్ సుందర్ ముఖంలో కుమార్తె ప్రయోజకురాలు అయిందనే ఆనందం, తన బిడ్డ తనకంటే ఎత్తుకు ఎదిగిందనే గర్వం స్పష్టంగా కనబడ్డాయి. అదే అందరినీ ఆకర్షించింది. ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పోలీస్ శాఖ మొదటి సారిగా తిరుపతిలో నిర్వహించిన పోలీస్ డ్యూటీ మీట్ 2021లో ఈ దృశ్యం చోటుచేసుకుంది.

మెగాస్టార్ చిరంజీవి కూడ ఆ ఫోటోను చూసి తన భావనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఆ ఫోటోలో ఉన్నది తండ్రి సీఐ శ్యామ్ సుందర్, కూతురు డిఎస్పీ జెస్సి ప్రశాంతి. తన గుండెల మీద ఎత్తుకుని పెంచిన బిడ్డ తనపై అధికారిగా వచ్చినప్పుడు ఆ తండ్రి చేసిన సెల్యూట్లో బోలెడంత సంతృప్తిని, గర్వాన్ని, ప్రేమను చూశాను. శ్యామ్ సుందర్‌గారు మీకు నా సెల్యూట్. మీ ఇద్దరు ఇంకెందరికో స్ఫూర్తి’ అన్నారు.

Exit mobile version