బాలయ్యను ఒప్పించిన క్రాక్ డైరెక్టర్ ?

gopichand malineni balayya
‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న గోపీచంద్ మలినేని ‘క్రాక్’ సినిమాతో కమర్షియల్ దర్శకుడిగా స్థిరపడిపోయారు. రవితేజ హీరోగా రూపొందిన ఈ చిత్రం పక్కా మాస్ ఎంటర్టైనర్ గా మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తూ మొత్తానికి ‘క్రాక్’ కేక అనిపించుకుంది. అందుకే గోపీచంద్ కి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి.

వాటిల్లో ముఖ్యమైనది బాలయ్యతో సినిమా. గోపీచంద్ మలినేని కొన్ని మాస్ సీన్లు తీసిన విధానం బాలయ్యకు చాల బాగా నచ్చిందట. అందుకే బాలయ్యే స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ క్రమంలోనే బాలయ్య బాబు తనకు సరిపోయే కథ ఉంటే చెప్పమన్నట్లు.. గోపీచంద్ కూడా బాలయ్యకు తాజాగా ఒక లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా గోపీచంద్ బాలయ్యకు కథ చెప్పాడట. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో సినిమా చేస్తున్న బాలయ్య తన తర్వాతి సినిమాని ‘క్రాక్’ దర్శకుడితోనే చేస్తాడట.

Exit mobile version