మహేష్ మాస్ సాంగ్ తో మళ్ళీ వచ్చిన వార్నర్.!

warner

ఆస్ట్రేలియన్ డాషింగ్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ ఆ మధ్య లాక్ డౌన్ లో మన తెలుగు టాప్ స్టార్ హీరోల సినిమాల టిక్ టాక్ వీడియోస్ తో ఎంతలా రచ్చ చేసాడో తెలిసిందే. అలాగే వాటిలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల వీడియోస్ తో కూడా వార్నర్ అదరగొట్టాడు. అంతే కాకుండా ఐపీఎల్ స్టార్ట్ అయ్యాక తనకి మన తెలుగులో ఫేవరెట్ హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది మహేష్ బాబే అని కూడా సెలవిచ్చాడు.

అయితే అప్పుడు “మైండ్ బ్లాక్” సాంగ్ తో మెస్మరైజ్ చేసిన వార్నర్ ఇప్పుడు మహేష్ చేసిన “మహర్షి”లో మరో మాస్ సాంగ్ “పాల పిట్ట” సాంగ్ లోని ఓ బిట్ తో వీడియో చేసి తన సోషల్ మీడియాలో వదిలాడు. మరి దీనికి మళ్ళీ మంచి రెస్పాన్స్ మహేష్ ఫ్యాన్స్ నుంచి వస్తుంది. మరి వార్నర్ నుంచి మున్ముందు ఇంకెలాంటి వీడియోలు వస్తాయో చూడాలి. ఇంతకీ వార్నర్ చేసిన ఈ వీడియో చూడకపోతే ఈ కింద ఉంది చూసెయ్యండి.

Exit mobile version