నట సింహం బాలయ్య బాబు – బోయపాటి శ్రీను తమ కొత్త సినిమాను మే 28న విడుదల చేయబోతున్నట్లు ప్లాన్ చేసారు. అయితే అప్పటిలోగా ఈ సినిమా పూర్తి అయ్యేలా కనిపించడం లేదట. కొన్ని షెడ్యూల్స్ స్లోగా షూటింగ్ జరుపుకోవడం, అలాగే ఫ్యాడింగ్ ఆర్టిస్ట్ ల కాంబినేషన్ సీన్స్ ఎక్కువగా ఉండటం, కానీ ఆ ఆర్టిస్ట్ లందరి డేట్స్ ఒకే టైంలో దొరికే అవకాశం లేకపోవడంతో మొత్తానికి ఈ సినిమా పై ఎఫెక్ట్ పడింది. దాంతో షూటింగ్ లేటుగా అవుతుంది.
ఇక నటసింహం బాలయ్య బాబు సినిమాలకు కథ పవర్ ఫుల్ గా ఉన్నా లేకపోయినా, సినిమా టైటిల్స్ మాత్రం పవర్ ఫుల్ గా ఉంటాయి. అందులో బోయపాటి, బాలయ్య సినిమా అంటే కచ్చితంగా అదిరిపోయే టైటిల్ ఉండాలి. అలాంటి టైటిల్ కోసం బోయపాటి ప్రస్తుతం అన్వేషణ చేస్తున్నాడు. అన్నట్టు ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్ మెయిన్ హీరోయిన్. ఇక ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు.
