
బాలీవుడ్ బాక్సాఫీస్ బాద్షా షారుఖ్ ఖాన్ కు ఒక సరైన హిట్ పడి కూడా చాలా కాలం అయ్యింది. దీనితో ఒక సాలిడ్ హిట్ ఇచ్చి గట్టి కం బ్యాక్ ఇవ్వాలని షారుఖ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి అలా ఇప్పుడు “పటాన్” సినిమా చేస్తున్న షారుఖ్ కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తో ఓ సినిమా చేస్తున్నాడని ఆ మధ్య టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.
అలాగే ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై మంచి అంచనాలు కూడా సెట్టయ్యాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో అన్నది టాక్ వినిపిస్తుంది. ఈ క్రేజీ కాంబినేషన్ లో చిత్రం వచ్చే ఆగష్టు నుంచి పట్టాలెక్కనుంది లేటెస్ట్ రూమర్స్ వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే అట్లీ ఈసారి ఎలాంటి సబ్జెక్టుతో వస్తాడు ముఖ్యంగా షారుఖ్ ను ఎలా ప్రెజెంట్ చేస్తాడు అన్న వాటిపై మరింత ఆసక్తి నెలకొంది.