భీష్మ సినిమాతో తన ఖాతాలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న వెంకీ కుడుముల తన తరువాత సినిమా కోసం స్క్రిప్ట్ ను రెడీ చేసుకున్నాడని, వైష్ణవ్ తేజ్ కి కథ కూడా వినిపించాడని రీసెంట్ గా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వెంకీ సినిమా మరో రూమర్ వినిపిస్తోంది. వెంకీ, నితిన్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే నితిన్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేశాడని..నితిన్ కి కూడా కథ బాగా నచ్చిందని తెలుస్తోంది. అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతి లోపు సినిమాని ఫినిష్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. కాగా భీష్మ ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో వెంకీ తరువాత సినిమా పై ప్రేక్షకుల్లో బాగా ఆసక్తి ఏర్పడింది. వెంకీ – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి.
