ఆల్ టైం రికార్డ్ తో ‘పెద్ది’ స్లో పాయిజన్ సాంగ్!

Peddi

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”. ఈ సినిమా నుంచి వచ్చిన ప్రతీ సాంగ్ ఇప్పుడు మ్యూజిక్ ఛార్ట్స్ ను రూల్ చేస్తున్నాయి. మొదటి సాంగ్ గా వచ్చిన చికిరి చికిరి భారీ రెస్పాన్స్ ని కొల్లగొట్టగా రెండో సాంగ్ గా వచ్చిన రయ్ రయ్ రారా పాన్ ఇండియా లెవెల్లో మాస్ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

సాంగ్ వచ్చిన రోజునే ఇదొక స్లో పాయిజన్ సాంగ్ అని చాలామంది భావించారు. ఇప్పుడు అదే రీతిలో అందరికీ ఈ సాంగ్ ఎక్కేస్తుంది. ఇలా తెలుగు వెర్షన్ సాంగ్ ఇప్పుడు ఆల్ టైం రికార్డు సెట్ చేసినట్టు మేకర్స్ ప్రకటించారు. 24 గంటల్లో ఏకంగా 3 కోట్లకి పైగా వ్యూస్ సాధించి ఆల్ టైం రికార్డు సెట్ చేసిన సాంగ్ గా నిలిచింది.

ఇదంతా కేవలం తెలుగు వెర్షన్ లోనే కావడం గమనార్హం. చికిరి చికిరి కంటే దీనికే ఎక్కువ రెస్పాన్స్ రావడం మరో విశేషం. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 30న సినిమా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.

Exit mobile version