ఇండియన్ స్క్రీన్ పై మొట్టమొదటి సారిగా ఒకే ఒక్క క్యారెక్టర్ తో ఎడిటింగ్ లేకుండా ఉత్కంఠ భరితంగా సాగిపోయే కథ కధనం తో తెరకెక్కుతోన్న చిత్రం 105 మినిట్స్. ఈ చిత్రంలో హన్సిక మోట్వాని కథానాయిక. సింగిల్ షాట్ మరియు సింగిల్ క్యారెక్టర్, రీల్ టైం మరియు రియల్ టైం ఈ చిత్రానికి హైలైట్స్ అని చిత్ర యూనిట్ మొదటి నుండి చెప్పుకొస్తుంది. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ సమీపం లోని ఓ ఇంట్లో ఈ చిత్రం షూటింగ్ జరిగింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయింది. మరొక పక్క నిర్మాణాంతర కార్యక్రమాలను జరపడానికి చిత్రం యూనిట్ సమాయత్తమవుతోంది. నేడు హన్సిక పుట్టినరోజు సందర్భంగా 105 మినిట్స్ చిత్రం యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. అలాగే హన్సిక ఫస్ట్ లుక్ ను ప్రముఖ డైరెక్టర్ బాబి విడుదల చేసి, ఆమెకు బర్త్ డే విషెస్ తెలియజేసారు.
రుధ్రాన్ష్ సెల్యూలాయిడ్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సామ్ సి.యస్ సంగీతం సమకూర్చుతున్నారు. కిషోర్ బొయిదాపు సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకి యాక్షన్ డైరెక్టర్ మల్లి, పిఆర్ఓ రాజ్ కమల్. ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
