మెగాస్టార్ చిరంజీవి మరొకసారి ఒలింపిక్ మెడల్ అందుకున్న మీరాబాయి చాను పై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం గర్వించేలా ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో సిల్వర్ మెడల్ గెలిచిన ఇండియన్ అంటూ చెప్పుకొచ్చారు. ఇంటికి చేరిన రోజు నుండి కొందరు వ్యక్తుల కోసం వెతుకుతూనే ఉంది అని పేర్కొన్నారు. అయితే చివరికి వారందరినీ ఇంటికి పిలిచి, మొత్తం 150 మందికి భోజనాలు పెట్టీ, బట్టలు పెట్టీ, కాళ్ళకి దణ్ణం పెట్టింది అని తెలిపారు. వాళ్ళందరూ కూడా తన ఊరి నుండి పాతిక మైళ్ళ దూరం లో ఉన్న ఇంఫాల్ స్పోర్ట్స్ అకాడెమీ కి వెళ్లేందుకు మీరా బాయి కి రోజు లిఫ్ట్ ఇచ్చిన ట్రక్ డ్రైవర్స్, క్లీనర్, హెల్పర్స్ అని పేర్కొన్నారు. ఇది కదా గెలుపు లో సాయం చేసిన ప్రతి ఒక్కరి పట్ల గ్రాటిట్యూడ్ అంటే, నీ మనసు బంగారం తల్లి అని చిరు సంతోషం వ్యక్తం చేశారు.
