శ్రీ లగడపాటి భార్గవ సమర్పణలో లగడపాటి శ్రీనివాస్ శ్రీ ఎల్.వి.ఆర్ సంస్థ నుండి వస్తున్న చిత్రం గ్రేట్ శంకర్. మలయాళంలో భారీ విజయం సాధించిన మమ్ముట్టి మాస్టర్ పీస్ చిత్రాన్ని తెలుగు లోకి గ్రేట్ శంకర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. క్రాక్, నాంది లాంటి విభిన్న చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ లో ఏసీపీ పాత్రలో నటిస్తున్నారు. మంచి కథాబలం తో మర్డర్, థ్రిల్లర్ ,మిస్టరీ తో అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే కథనంతో ప్రేక్షకులను అలరించనుంది.
ఈ చిత్రానికి దీపక్ దేవ్ సంగీతం అందించారు. ఉన్ని ముకుందన్, పూనమ్ బజ్వా తదితరులు నటించిన ఈ చిత్రం తెలుగులో కూడా పెద్ద హిట్టవుతుంది అని నిర్మాత లగడ పాటి శ్రీనివాస్ అన్నారు.
