‘పెద్ది’ స్పెషల్ సాంగ్.. ‘ధురంధర్’ బ్యూటీ కావాలంటున్న ఫ్యాన్స్!

peddi 4

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చి బాబు సానా కలయికలో చేస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమానే ధురంధర్. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు ఆఖరి దశకు చేరుకుంటుంది. అయితే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందని గత కొంత కాలం నుంచి సాలిడ్ బజ్ ఉంది. అందుకు గాను మృణాల్ ఠాకూర్ పేరు కూడా వినిపించింది. కానీ ఫైనల్ అయినట్టు తెలియరాలేదు.

కానీ ఇప్పుడు ధురంధర్ సినిమాలో ఐటమ్ సాంగ్ తో అందరి దృష్టి ఆకర్షించిన హాట్ బ్యూటీ పేరుని ఫ్యాన్స్ తలుస్తున్నారు. మరి ఆమె ఎవరో కాదు తెలుగులో కూడా పలు సినిమాలు చేసిన బ్యూటీ ఆయేషా ఖాన్. ధురంధర్ 1 లో ఆమె చేసిన సాంగ్ పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ఆమె రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి చూపించిన ఇంట్రెస్ట్ తాలూకా క్లిప్ కూడా వైరల్ అవుతుంది.

దీనితో పెద్ది లాంటి పాన్ ఇండియా సినిమాకి ఆయేషా ఖాన్ గ్లామర్, ఏ ఆర్ రెహమాన్ స్కోర్ లో మంచి సాంగ్ పడితే పాన్ ఇండియా వైడ్ గా అది సినిమాకి మంచి బూస్టప్ గా నిలిచే ఛాన్స్ ఉంది. సో మేకర్స్ అభిమానుల కోరిక తీరుస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే.

Exit mobile version