సుశాంత్ రెడ్డి దర్శకత్వం లో మేఘా ఆకాష్, అదిత్ అరుణ్ లు హీరో హీరోయిన్ లుగా కలిసి నటిస్తున్న తాజా చిత్రం డియర్ మేఘా. ఈ చిత్రం రొమాంటిక్ డ్రామా గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం విడుదల కి సిద్దం అయింది. సెప్టెంబర్ మూడవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.
డియర్ మేఘా దియా చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రం గురించి తాజాగా హీరో అదిత్ అరుణ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. డియర్ మేఘా చిత్రం తన కెరీర్ లో ముఖ్యమైన సినిమా అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రాన్ని ఆరు నెలల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. కథ మరియు పాత్ర నచ్చి చేసినట్లు తెలిపారు. టైటిల్ పై ఎలాంటి అసమ్మతి లేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి గౌరా హారి సంగీతం అందిస్తున్నారు. సోరింగ్ ఎలిఫెంట్ ఫిల్మ్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ చిత్రాన్ని నిర్మించడం జరిగింది.
