ప్రభాస్ ‘స్పిరిట్’ పై కొత్త రూమర్ ?

Spirit

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్టార్ లైనప్‌ లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్'(Spirit). సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఓ పవర్‌ ఫుల్ కాప్ స్టోరీగా రాబోతుంది. ఈ సినిమాలో త్రుప్తి దిమ్రిని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుత షెడ్యూల్ లో జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్ షూట్ అనంతరం.. ఓ సాంగ్ ను షూట్ చేయనున్నారు. ఈ సాంగ్ లో ప్రభాస్ స్టెప్స్ తో పాటు త్రుప్తి దిమ్రిని గ్లామర్ కూడా హైలైట్ గా ఉంటుందట. మరి ఈ సాంగ్ ఎంత గ్రాండ్ గా ఉండబోతుందో చూడాలి.

కాగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ అద్భుతంగా ఉంటుందట. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ని సృష్టించింది. ప్రభాస్ లుక్ కూడా పక్కా వైల్డ్ అండ్ మాస్ అవతార్ లో లో ఉంది. కాగా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో సందీప్‌ రెడ్డితో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రాన్ని టి-సిరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. అన్నట్టు ‘స్పిరిట్‌’ మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని.. సందీప్ రెడ్డి వంగా నుంచి మరో వినూత్న సినిమా రాబోతుంది.

Exit mobile version