అటు ఎన్టీఆర్ ఇటు చరణ్.. మధ్యలో జాన్వీ

ntr 1

అందాల నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినిమాల పై ఫోకస్ పెంచినట్టు ఉంది. ముఖ్యంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకునే ప్రయత్నంలో ఉంది జాన్వీ. ఆమె ఆల్ రెడీ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ – ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ కలయికలో రాబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఐతే, ఇప్పుడు జాన్వీ కపూర్ కి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది అంటూ టాక్ నడుస్తోంది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. అయితే, ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను సంప్రదించగా.. ఆమె దాదాపుగా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే జాన్వీ కపూర్ కి టాలీవుడ్ లో స్టార్ డమ్ వచ్చేసినట్టే. చరణ్ తో కబడ్డీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌లో పనుల్లో ఉంది.

ఇక ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తాడని, ఒక హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌‌ను, మరో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్‌‌ని తీసుకుంటారని టాక్. మొత్తానికి అటు ఎన్టీఆర్ ఇటు చరణ్ లతో జాన్వీ కపూర్ వరుసగా సినిమాలు చేస్తోంది.

Exit mobile version