రీసెంట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చి సంచలన విజయాన్ని సాధించిన భారీ హిట్ చిత్రం “బేబి” కోసం అందరికి తెలిసిందే. మరి యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించారు. మరి ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించి ఇప్పటికీ సూపర్ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుండగా ఈ సినిమా ఫ్యాన్స్ కి అయితే ఓ సూపర్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో తెలుస్తోంది.
నిన్ననే ఈ సినిమాలో కొత్త సాంగ్ ని యాడ్ చేస్తున్నట్టుగా దర్శకుడు కన్ఫర్మ్ చేయగా దీనితో పాటుగా టోటల్ గా మరో 14 నిమిషాలు నిడివి అదనంగా యాడ్ చేయబోతున్నారట. అయితే ఈ అదనపు నిడివి కట్ తో డైరెక్టర్ కట్ గా సినిమా ఈ ఆగస్ట్ నుంచి అందుబాటులో ఉండనుంది అని తెలుస్తోంది. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు అలాగే ఎస్ కె ఎన్ నిర్మాణం వహించారు.
