ఇంటెన్స్ అండ్ థ్రిల్లింగ్ గా “మంగళవారం” ట్రైలర్ కట్.!

mangalavaram 3

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మెయిన్ లీడ్ లో టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ ఆమెని టాలీవుడ్ కి పరిచయం చేసిన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రమే “మంగళవారం”. మరి ఈ చిత్రాన్ని మొదటి నుంచి కూడా ఒక క్రేజీ థ్రిల్లర్ గా ప్రెజెంట్ చేస్తూ వస్తుండగా ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ కట్ ని అయితే మేకర్స్ రిలీజ్ చేశారు.

మరి ఈ ట్రైలర్ మాత్రం మంచి థ్రిల్లింగ్ మూవీస్ ని ఇష్టపడేవారికి ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చే దానిలా కనిపిస్తుంది. అని చెప్పాలి. ఒక ఊరిలో ప్రతి మంగళవారం అనూహ్యంగా జరుగుతున్నా మరణాలు ఏంటి దీని వెనుక ఉంది ఎవరు అనే పాయింట్ ని అజయ్ భూపతి సాలిడ్ గా ఇంటెన్స్ షాట్స్ తో ప్రెజెంట్ చేయడం ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఇక ఆద్యంతం ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు కూడా అజనీశ్ లోకనాథ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎసెట్ అని క్లియర్ కట్ గా ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. అలాగే పాయల్ రాజ్ పుత్ పాత్రపై వచ్చే బోల్డ్ సీన్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే థియేట్రికల్ గా ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ని అందిస్తుందో తెలియాలి అంటే ఈ నవంబర్ 17 వరకు ఆగాల్సిందే. ఈ డేట్ లో ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version