రాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై శ్రీనివాస్ సుబ్రహ్మణ్య నిర్మాణంలో రాకీ షెర్మన్ తెరకెక్కించిన చిత్రం ‘కర్మస్థలం’. ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అర్చన(వేద), మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బాలగం సంజయ్, నాగ మహేష్, దిల్ రమేష్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషించారు. పాన్ ఇండియా రేంజ్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను హీరో ఆకాష్ పూరి రిలీజ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ‘కర్మస్థలం అనే టైటిల్ చాలా బాగుంది. మోషన్ పోస్టర్ కూడా బాగుంది. చెప్పాలంటే నేను కూడా అమ్మవారి భక్తుడిని. ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం సువర్ ఎక్సైటింగ్. ఈ మధ్య హనుమాన్, కార్తికేయ, కాంతారా ఇలాంటి సినిమాలని ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తున్నారు. బాగున్న సినిమాలను మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ ముందుకి తీసుకెళ్తారు. ఈ సినిమాని కూడా ముందుకు తీసుకెళ్తారు. ప్రొడ్యూసర్ గారికి హాట్స్ ఆఫ్.. ఇలాంటి యంగ్ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చినందుకు. నేను కర్మని నమ్ముతాను. మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది. అలానే చెడు చేస్తే చేడు జరుగుతుంది అని నమ్ముతాను. ఇలాంటి కథ చేయాలి అని నాకూ ఉంది.’ అని అన్నారు.
హీరో విజయ్ శంకర్ మాట్లాడుతూ..‘కర్మస్థలం అనే టైటిల్ లోనే ఒక రోయాలిటీ వుంది. మైండ్ లోకి వెళ్లిపోయే టైటిల్. వచ్చే దారిలో ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూస్తూ వచ్చాను. చాలా బాగుంది. ఫస్ట్ నుంచి ప్రమోషన్స్ చాలా బాగా చేస్తున్నారు. అలానే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఇలానే చేయండి. మన టాలీవుడ్ లో మూవీస్ బాగా చేస్తున్నారు కానీ ప్రమోషన్స్ టైం లో డ్రాప్ అయిపోతున్నారు. ఈ మూవీ కి ఆలా కాకుండా ప్రమోషన్స్ మీద టైం పెట్టండి మంచి బ్లాక్ బస్టర్ సొంతం చేసుకుంటారు. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’ అని అన్నారు.
హీరోయిన్ మిథాలీ చౌహాన్ మాట్లాడుతూ.. ‘ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ రాకీ గారికి థాంక్స్. ఈ క్యారెక్టర్ చేయడం వల్ల మంచి అపీసియేషన్స్ వస్తాయి అని అనుకుంటున్నాను. చాలా థాంక్స్.’ అని అన్నారు.
ప్రొడ్యూసర్ యువరాజ్ మాట్లాడుతూ..‘నేను పూణే నుంచి వచ్చాను. 8 నెలల క్రితం నేను రెండు లైన్స్ స్టోరీ విన్నాను. చాలా నచ్చింది. సనాతన దర్మం గురించి చెప్పే సినిమా ఇది. రాకీ చాలా హార్డ్ వర్కింగ్. ఈ సినెమా కోసం తన 100% ఇచ్చాడు. థాంక్ యూ.’ అని అన్నారు.
డైరెక్టర్ రాకీ మాట్లాడుతూ..‘మనం సాధారణంగా ఎలాంటి పండగ వచ్చిన ఎంజాయ్ చేస్తూ ఉంటాం. దాని వెనకాల ఒక హిస్టరీ, వార్ ఇలా చాలా వున్నాయి. ఇందులో ఒక మంచి లైన్ చెప్పాను. అదే మహిసాసుర మర్ధిని. అందరికి మోషన్ పోస్టర్ నచ్చింది అనుకుంటున్నాను. నేను ఎంత ప్యూర్ గా నమ్మానో అంత మంచిగా ఈ సినిమా చేశాను. అందరూ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను.’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో నటుడు సతీష్ సరిపల్లి, క్రాంతి కిల్లి తదితరులు పాల్గొని మాట్లాడారు.
