న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘దసరా’ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల ఓవర్ నైట్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం నానితో ‘ది ప్యారడైజ్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే, విడుదలైన ఈ సినిమా గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ బజ్‌ని సృష్టించింది. అయితే, ఓ ఇంటర్వ్యూలో, నాని ఈ చిత్రాన్ని మ్యాడ్ మ్యాక్స్ కి ఇండియన్ వెర్షన్‌గా అభివర్ణించారు. కాగా తాజా అప్‌డేట్ ప్రకారం, సీక్వెల్ ట్రెండ్‌ను అనుసరించి ఈ సినిమా రెండు భాగాలుగా నిర్మించబోతున్నారు. మొదటి భాగం మార్చి 26, 2026న విడుదల కానుండగా, ఇక రెండవ భాగం ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.
కాగా పక్కా యాక్షన్ ఎలిమెంట్స్ తో రాబోతున్న ఈ సినిమాలో మాస్ కి ఫుల్ మీల్స్ లా ఉంటుందట సినిమా. అన్నట్టు ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిర సినిమాస్ ‘ది ప్యారడైజ్’ చిత్ర ఓవర్సీస్ రైట్స్‌ను భారీ డీల్‌కు దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి. పైగా నాని కెరీర్‌లో ఇది హయ్యెస్ట్ ఓవర్సీస్ డీల్ అని టాక్. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటించే కథానాయికను ఇంకా ప్రకటించలేదు. కాగా ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
