ఫోటో మూమెంట్ : రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ క్యూట్ పిక్

ramcharan cheeru

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని చరణ్ చేతుల మీదుగా ఆవిష్కృతం అయింది. ఈ ఈవెంట్ కోసం మెగా ఫ్యామిలీ లండన్‌కు వెళ్లింది.

ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ స్థాయి అంతర్జాతీయంగా అమాంతం పెరిగిపోయింది. ఇక ఆయనకు గ్లోబల్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటంతో మేడమ్ టుస్సాడ్స్ లైబ్రరీలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా, ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖతో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఇక తాజాగా రామ్ చరణ్ మైనపు విగ్రహంతో మెగా ఫ్యామిలీ తీసుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తూ తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version