షాకింగ్ ట్విస్ట్: చివరి నిమిషంలో ‘టాక్సిక్’ వాయిదా.. కొత్త డేట్ తో కారణం రివీల్!

Toxic

కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “టాక్సిక్”(Toxic). కన్నడ మరియు ఇంగ్లీష్ లో ఏకకాలంలో తెరకెక్కించిన ఈ భారీ చిత్రం ఈ మార్చ్ 19 గ్రాండ్ రిలీజ్ కి మేకర్స్ సిద్ధం చేశారు. అలాగే ఆల్రెడీ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి కానీ ఇప్పుడు షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే మేకర్స్ ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు అఫీషియల్ ప్రెస్ నోట్ ద్వారా రివీల్ చేశారు.

తాము ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ ప్రాజెక్ట్ ని మార్చ్ 19 నుంచి వాయిదా వేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. ఈ మధ్యనే మొదలైన మిడిల్ ఈస్ట్ దేశాల్లో పరిస్థితులు బాగోని కారణంగా ఈ సినిమాని వాయిదా వేస్తున్నట్టు ఖరారు చేశారు. రీసెంట్ గా ఈ కారణం ఎఫెక్ట్ ఉంటుంది అని తెలిపాము. ఇప్పుడు అదే నిజం అయ్యి ఈ సినిమా వాయిదా కన్ఫర్మ్ అయ్యింది. ఇక కొత్త డేట్ గా మేకర్స్ ఈ జూన్ 2ని ఖరారు చేసి రివీల్ చేశారు. సో యష్ అభిమానులు ఈ సినిమా కోసం ఎదురు చూడక తప్పదు.

Exit mobile version