థియేటర్లలో సందడి చేసిన ‘మార్గన్’ టీం

margan

విజయ్ ఆంటోని నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మార్గన్’కు లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ నిర్మించిన ఈ సినిమాను, సర్వాంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై జె. రామాంజనేయులు సమర్పించారు. జూన్ 27న సురేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

రిలీజ్ అయిన తొలి రోజునే ‘మార్గన్’కు తెలుగు, తమిళ భాషల్లో మంచి స్పందన లభించింది. ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిత్రయూనిట్ హైదరాబాద్‌లోని పలు థియేటర్లను సందర్శించింది. అక్కడ సినిమా చూస్తున్న ప్రేక్షకులకు ‘మార్గన్’ టీం సర్‌ప్రైజ్ ఇచ్చింది. నటులు అజయ్ ధీషన్, దీప్శిఖ, బ్రిగిడా తదితరులు ప్రేక్షకులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు.

ప్రేక్షకుల నుంచి లైవ్‌గా వచ్చిన స్పందనను చూసి చిత్రబృందం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. థియేటర్లలో సందడి చేసిన ‘మార్గన్’ టీం, ప్రేక్షకుల ప్రేమను ఆస్వాదిస్తూ, సినిమా విజయాన్ని మరింత ఘనంగా మార్చారు.

Exit mobile version