కర్నూలు జిల్లా దేవరగట్టు బన్నీ ఉత్సవాలలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన చిన్న ఆంజనేయ కుటుంబానికి తానా బోర్డు ఆఫ్ డైరెక్టర్ పొట్లూరి రవి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆదోనికి చెందిన చిన్న ఆంజనేయ కూలీ పనులు చేసుకుంటూ భార్య, ముగ్గురు పిల్లలను పోషించేవారు. ఆయన నందమూరి బాలకృష్ణకు వీరాభిమాని కావడంతో తన ఎడమ చేతిపై ‘NBK’ అని పచ్చబొట్టు కూడా వేయించుకున్నారు.
మాలమల్లేశ్వరస్వామి దర్శనం కోసం దేవరగట్టు బన్నీ ఉత్సవాలకు వెళ్లి చిన్న ఆంజనేయ తొక్కిసలాటలో కన్నుమూశారు. మృతుడి కుటుంబ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా, ఎన్నారైలు పొట్లూరి రవి, వెంకట్ సుంకర, వేణు కోడే, సుబ్రమణ్యం ఒసూరు కలిసి లక్ష రూపాయల సహాయాన్ని భార్య ఈరమ్మ, కుమారుడు రామాంజికి అందించారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ అభిమాన సంఘం అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, సందడి మధు సహా పలువురు పాల్గొన్నారు.
