‘అఖండ 3’ టైటిల్ ఇదేనా.. ‘పుష్ప 3’ లానే లీక్ చేసారుగా!

అఖండ 3
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్ గా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ చిత్రమే ‘అఖండ 2 తాండవం’. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులకి ఓ క్రేజీ లీక్ ఇపుడు మరింత ఎగ్జైటింగ్ గా మారింది.

ఆ మధ్య ఇండియన్ సినిమాని షేక్ చేసిన పుష్ప 2 ఫైనల్ వర్క్స్ లో మూడో పార్ట్ కి సంబంధించి టైటిల్ ‘పుష్ప ది ర్యాంపేజ్’ అంటూ మేకర్స్ ఫైనల్ వర్క్ స్టూడియో నుంచి బయటకి వచ్చింది. అక్కడ ఉన్నట్టే థియేటర్స్ లో కూడా పార్ట్ 3 కి పుష్ప 3 ది ర్యాంపేజ్ అనే అనౌన్స్ చేశారు.

ఇక ఇదే ఫార్మాట్ లో అఖండ 3 టైటిల్ కూడా లీకయ్యింది అని చెప్పాలి. తాజాగా థమన్ షేర్ చేసిన పిక్ లో బ్యాక్గ్రౌండ్ లో “జై అఖండ” అంటూ టైటిల్ కనిపిస్తుంది. దీనితో అఖండ 3 టైటిల్ కూడా ఇదే కావడానికి గట్టి ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి అదేంటి అనేది రేపు స్పెషల్ ప్రీమియర్స్ తో తేలిపోతుంది.

Exit mobile version