మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు నటిస్తున్న అవైటెడ్ చిత్రమే “పెద్ది”(Peddi). యువ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో చేస్తున్న ఈ రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ పట్ల మంచి బజ్ ఉంది. దీనితో ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ సినిమా ఒకసారి వాయిదా పడింది. కొత్త డేట్ గా ఈ ఏప్రిల్ 30 ని సెట్ చేశారు. అయితే ఈ డేట్ కి రావడానికి మేకర్స్ అహర్నిశలు ఇప్పుడు శ్రమిస్తున్నారట.
షూటింగ్ ఇంకా బాకీ ఉంది. దీనితో అనుకున్న టార్గెట్ లోపే రావాలనే టెన్షన్ కూడా ఇంకో పక్క ఉందట. సో ఈ కొత్త డేట్ విషయంలో కూడా అభిమానులు కొంచెం ఇప్పుడు నుంచే ప్రిపేర్డ్ గా ఉంటే బెటర్ అనుకోవచ్చు. ఆన్ టైం వచ్చేస్తే హ్యాపీనే కానీ మళ్ళీ వాయిదా అంటే అభిమానులకి మరోసారి నిరాశగా మిగులుతుంది. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.
